Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్ వేధించాడన్న హాలీవుడ్ నటి... సోషల్ మీడియాలో వైరల్!

  • నా వెనుక భాగాన్ని నిమిరాడంటూ బుష్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన హీథర్ లిండ్ 
  • టీవీ షో ప్రమోషన్ లో భాగంగా జార్జ్ బుష్ సీనియర్ ఇంటికెళ్లాను
  • వేధింపుల సమయంలో బుష్ భార్య బార్బారా కూడా ఉన్నారన్న లిండ్
అమెరికాలోని సోషల్ మీడియాలో లైంగిక వేధింపులపై పెద్ద ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. మీ  టూ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఉద్యమం నడుస్తుండగా, వేధింపులకు గురైన పలువురు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టీన్ వేధింపుల ఘటన కలకలం రేపగా, తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్ తనను వేధించాడని నటి హీథర్ లిండ్ సంచలన ఆరోపణ చేసింది. ఓ టీవీ షో ప్రమోషన్‌ లో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి బుష్ నివాసానికి వెళ్లానని ఆమె తెలిపింది.

కొంత సేపు మాట్లాడిన తరువాత బుష్ తన వెనుక భాగాన్ని నిమిరారని పేర్కొంది. అనంతరం తన చెవిలో బూతుమాట చెప్పారని తెలిపింది. దీంతో నిర్ఘాంతపోయానని వెల్లడించింది. ఈ సమయంలో బుష్ భార్య బార్బారా కూడా అక్కడే ఉన్నారని ఆమె తెలిపింది. దీనిని సెక్యూరిటీ సిబ్బందికి కూడా తెలిపానని ఆమె వెల్లడించింది.

అయితే ఆయన దగ్గరకు ఎందుకు వెళ్లావ్? అంటూ తనపై మండిపడ్డారని ఆమె తెలిపారు. ఇది వైరల్ కావడంతో బుష్ సీనియర్ స్పందించారు. తాను సరదాగా చేయి వేశానని.. తప్పైతే క్షమించు అని వేడుకున్నారు. తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన అధికారికంగా ప్రకటించారు
harassment
america
bush
heather lind

More Telugu News